మియాపూర్ PJR స్టేడియం అభివృద్ధి పనులపై ఉన్నతాధికారుల క్షేత్రస్థాయి పరిశీలన

శేరిలింగంప‌ల్లి, న‌వంబ‌ర్ 21 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) పరిధిలోని మియాపూర్ సర్కిల్-48లో ఉన్న PJR స్టేడియం అభివృద్ధి పనులను ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. స్టేడియంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులతో పాటు ఖేలో ఇండియా (Khelo India) ప్రాజెక్టు పనుల పురోగతిని సమీక్షించారు. ఈ పరిశీలనలో శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ (SLPZ) నారాయ‌ణ్ అమిత్‌, సూపరింటెండింగ్ ఇంజినీర్ (SE), మియాపూర్ సర్కిల్-48 డిప్యూటీ కమిషనర్ (DC) శ్రీ‌నివాస్‌, అర్బన్ బయోడైవర్సిటీ (UBD), ఇంజినీరింగ్ విభాగాల అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా స్టేడియంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతిని అధికారులు పరిశీలించారు. క్రీడాకారులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, పనుల నాణ్యత ప్రమాణాలు, ప్రాజెక్టు అమలు తీరుపై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని, నిర్ణీత గడువులోగా పనులన్నీ పూర్తి చేయాలని సంబంధిత ఇంజినీరింగ్, UBD అధికారులను ఉన్నతాధికారులు ఆదేశించారు. పనులు పూర్తయ్యే వరకు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. PJR స్టేడియం అభివృద్ధి పనులను వేగవంతం చేసి, స్థానిక ప్రజలతో పాటు ఔత్సాహిక క్రీడాకారులకు మెరుగైన క్రీడా మౌలిక సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here