నమస్తే శేరిలింగంపల్లి: భారతీయ జనతాపార్టీ ఓబిసి మోర్చ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏశం శ్రీశైలంయాదవ్ అకాల మరణం పార్టీకి తీరని లోటని పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ అన్నారు. మంగళవారం బిజెపి ఓబిసి మోర్చ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బోయిన మహేష్‌యాదవ్ ఆధ్వర్యంలో శ్రీశైలంయాదవ్ సంతాపసభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జ్ఞానేంద్రప్రసాద్ తో పాటు బిజెపి నాయకులు శ్రీశైలంయాదవ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ గంగారం హనుమాన్ దేవాలయ అభివృద్దితో పాటు స్థానిక ప్రజల సమస్యల పరిష్కారంలో శ్రీశైలంయాదవ్ చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు. శేరిలింగంపల్లి ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ మంచి నాయకుడిగా గుర్తింపు పొందారని అన్నారు. శ్రీశైలంయాదవ్ ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోదైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు కోటేశ్వరరావు, జితేందర్, బాబురెడ్డి, శ్రీనివాస్ యాదవ్, సాయికుమార్గౌడ్, నవీన్, రాహుల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
