చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్ పేట డివిజన్ పరిధిలోని శాంతినగర్ పోచమ్మ దేవాలయంలో శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు రెండవ రోజు ఘనంగా కొనసాగాయి. ఆదివారం అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారీ వర్షాల నుండి కాపాడాలని అమ్మవారిని వేడుకున్నారు.






