చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ శిల్పా ఎంక్లేవ్ లోని విశాఖ శ్రీ శారదా పీఠ పరిపాలిత శ్రీలక్ష్మీ గణపతి దేవాలయంలో శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు 3వ రోజు ఘనంగా కొనసాగాయి. ఆలయంలోని భ్రమరాంబ దేవి శ్రీ అన్నపూర్ణాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారు శివుడికి అన్నం వడ్డిస్తున్నట్టు అద్భుత అలంకరణ భక్తులకు కనువిందు చేసింది. శ్రీ అన్నపూర్ణ దేవి అలంకరణ, పూజ, ప్రసాదం సేవలో భక్తులు సత్యనారాయణ, ప్రసాద్ శర్మ, కామేశ్వరిలు శ్రీలక్ష్మీగణపతి సన్నిధి లక్ష్మీ దేవి వస్త్రాలంకరణ సేవలో రమాదేవి, లక్ష్మీకుమారిలు, ప్రసాద సేవలో వెంకటరామకృష్ణ, సమీరాదేవిలు భాగస్వామ్యం అయ్యారు. పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నపూర్ణాదేవిని దర్శించుకున్నారు.






