ఖానామెట్ స్మ‌శాన‌వాటిక వేలాన్ని పునఃప‌రిశీలించాలి: కార్పొరేట‌ర్ జ‌గ‌దీశ్వ‌ర్‌గౌడ్‌

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: మాదాపూర్ డివిజ‌న్ ప‌రిధిలోని ఖానామెట్ స‌ర్వేనెంబ‌రు 44/14 లోగల స్మ‌శాన‌వాటిక స్థ‌లాన్ని వేలం వేసే విష‌యాన్ని పునఃప‌రిశీలించాల‌ని కోరుతూ కార్పొరేట‌ర్ జ‌గ‌దీశ్వ‌ర్‌గౌడ్ గ్రేట‌ర్ మేయ‌ర్ గద్వాల్ విజ‌య‌ల‌క్ష్మికి విన‌తిప‌త్రం స‌మ‌ర్పించారు. ఇజ్జ‌త్‌న‌గ‌ర్ వీక‌ర్‌సెక్ష‌న్ బ‌స్తీలో నివాస‌ముండే బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాల‌కు చెందిన ప్ర‌జ‌లు ఈ స్థ‌లంలోనే గ‌త 30 సంవ‌త్స‌రాలుగా త‌మ కుటుంబ స‌భ్యులు అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించుకుంటున్నార‌ని తెలిపారు. ఇప్ప‌టికే స్మ‌శాన‌వాటిక అభివృద్దికి కృషి చేస్తున్నామ‌ని, ఈ విష‌యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్ర‌జ‌ల‌కు న్యాయం చేయాల‌ని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు బ్రమయ్య యాదవ్, తైలి కృష్ణ, రంగ స్వామి, కేశవులు, శ‌శిధర్, నర్సింగ్ నాయక్, సైయ్యద షకీల్, ఎం.డి అమీర్, సైయ్యద రఫిక్, సిరాజ్ హుస్సేన్, సీత‌మ్మ త‌దిత‌రులు పాల్గొన్నారు.

మేయ‌ర్ విజ‌య‌ల‌క్ష్మికి విన‌త‌ప‌త్రం స‌మ‌ర్పిస్తున్న కార్పొరేట‌ర్ జ‌గ‌దీశ్వ‌ర్‌గౌడ్‌
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here