నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని ఖానామెట్ ఇజ్జత్‌నగర్ లో గల స్మశానవాటిక స్థలాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేలం వేసేందుకు నిర్ణయించడాన్ని వ్యతిరేకిస్తూ నియోజకవర్గ బిజెపి నాయకులు ఆదివారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్‌యాదవ్, కసిరెడ్డి భాస్కరరెడ్డిలతో పాటు నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవికుమార్‌యాదవ్ మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వానికి స్మశానవాటికలను అమ్ముకునే దౌర్భాగ్యం పట్టిందన్నారు. స్మశానవాటిక వేలాన్ని ఆపకపోతే న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు.
కసిరెడ్డి భాస్కరరెడ్డి మాట్లాడుతూ స్మశానవాటికలు దేవాలయాల కంటే పవిత్రమైనవని, వాటి జోలికి వస్తే ప్రజలు టిఆర్ఎస్ పార్టీని బొందపెట్టడం ఖాయమని హెచ్చరించారు. నిరసన చేపడుతున్న నాయకులను పోలీసులు అరెస్టు చేసి నార్సింగి పోలీస్‌స్టేషన్‌కు తరలించి అనంతరం స్వంత పూచీకత్తుపై విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో గంగల నర్సింహయాదవ్, రాధాక్రిష్ణయాదవ్, డివిజన్ ప్రధాన కార్యదర్శి టివి. మదనాచారి, శ్రీనివాస్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, శ్రీశైలం యాదవ్, బాలకుమార్, సూర్యనారాయణ, సుంకులు, మహిళా నాయకులు భారతి, స్వప్న రెడ్డి, చంద్రకళ, అనురాధ, బీజేవైఎం నాయకులు ఆనంద్, చరణ్, నరేష్ రెడ్డి పాల్గొన్నారు.