క‌రోనాను పార‌ద్రోలేందుకు ప్ర‌తి ఒక్క‌రూ టీకా వేయించుకోవాలి: భేరీ రామచందర్ యాదవ్

న‌మ‌స్తే శేరిలింగంపల్లి: ప్ర‌తీ ఒక్క‌రూ కోవిడ్ టీకా వేయించుకుని క‌రోనా మ‌హమ్మారిని పార‌ద్రోలేందుకు కృషి చేయాల‌ని నేతాజీ నగర్ కాలనీ అధ్యక్షులు, సామాజిక సేవార‌త్న పురస్కార గ్ర‌హీత‌ భేరీ రామచందర్ యాదవ్ అన్నారు. నేతాజీ నగర్ కాల‌నీ అసోసియేషన్ సభ్యులు, కిరాణ దుకాణాల య‌జ‌మానులు, ఆటో డ్రైవర్ల తో పాటు కాల‌నీవాసులకు టీకాలు అందించేందుకు కృషిచేశామ‌ని అన్నారు. నేటికీ కోవిడ్‌ టీకా వేసుకొని వారు తప్పనిసరిగా టీకాలు వేయించుకోవాల‌ని జిహెచ్ఎంసి సిబ్బందితో క‌లిసి ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఎ రాజేష్‌ యాదవ్, జిలాని, తిమ్మప్ప అసోసియేషన్ ఉపాధ్యక్షుడు రాయుడు, ఆశ బేగం, రాజు నాయక్, గణేష్ నాయక్, బాలరాజు నాయక్, బాల్రాజ్ సాగర్, లవణ చారి, చంద్ర శేఖర్ యాదవ్, పి శివ, కాలనీ యువజన నాయకులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

నేతాజీ న‌గ‌ర్‌లో వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మంపై ఇంటింటి ప్ర‌చారం నిర్వ‌హిస్తున్న భేరిరాంచంద‌ర్‌యాద‌వ్‌
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here