నమస్తే శేరిలింగంపల్లి: అయోధ్య శ్రీ రామ మందిర నిర్మాణానికి శేరిలింగంపల్లి సిర్వి సమాజ్ బృందం రూ. 3.03 లక్షల నిధి సమర్పణ చేశారు. సమాజ్ సభ్యులంతా కలిసి సేకరించిన రామ మందిర నిర్మాణ నిధిని మంగళవారం విశ్వహిందూ పరిషత్ సభ్యులు డి.రమణరావుకు అందజేశారు. రామ కార్యంలో భాగస్వాములై నిధి సమర్పణ చేసిన సిర్వి సమాజ్ సభ్యులకు రామసేవకులు పుట్ట వినయకుమార్ గౌడ్, డి.కల్పన, ఆర్.రేణుక, డి.కార్తిక్, వై సంతోష్, ఎస్.వెంకటరమణ, మన్యాయం, ఎం.ప్రణవ శేష సాయి కృతజ్ఞతలు తెలిపారు.