మియాపూర్(నమస్తే శేరిలింగంపల్లి): నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన మియాపూర్, చందానగర్ కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్, మంజుల రఘునాథ్‌రెడ్డిలను మియాపూర్ హెచ్ఎంటి స్వర్ణపురి కాలనీ అసోసియేషన్ సభ్యులు ఘనంగా సన్మానించారు. మంగళవారం కాలనీ కమ్యూనిటీ భవనంలో నిర్వహించిన కార్యక్రమంలో కార్పొరేటర్లను సన్మానించిన కాలనీ వాసులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఉప్పలపాటి శ్రీకాంత్, మంజుల రఘునాథ్ రెడ్డిలు మాట్లాడుతూ తమను గెలిపించిన డివిజన్ ప్రజలకు బుణపడి ఉంటామన్నారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరిస్తామన్నారు. కాలనీలలో అన్ని మౌలిక వసతులను ఏర్పాటు చేసి డివిజన్ అభివృద్దికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ టిఆర్ఎస్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, నాయకులు సుప్రజా ప్రవీణ్ , రవీందర్ రెడ్డి , కాలనీ అధ్యక్షులు దేవేందర్ లతో పాటు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.
