శిల్ప ఎన్‌క్లేవ్ ల‌క్ష్మీ గ‌ణ‌ప‌తి దేవాల‌యంలో ఘనంగా సంక‌ట హ‌ర చ‌తుర్థి

న‌మస్తే శేరిలింగంప‌ల్లి: చందాన‌గ‌ర్ డివిజ‌న్ ప‌రిధిలోని శిల్ప ఎన్‌క్లేవ్‌లో గ‌ల విశాఖ శ్రీ శారదా పీఠ పరిపాలిత శ్రీలక్ష్మీ గణపతి దేవాలయం సంకట హర చతుర్థిని ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఉద‌యం లక్ష్మీ గణపతి స్వామి కి పంచామృతాభిషేకం, అర్చన, శ్రీ లక్ష్మీ గణపతి హోమం నిర్వ‌హించారు. అనంత‌రం సాయంత్రం సిద్ది బుద్ది సమేత శ్రీ వర సిద్ది వినాయక స్వామి కళ్యాణం జ‌రిపించారు. ఈ కార్య‌క్ర‌మంలో భ‌క్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి తీర్థ ప్ర‌సాదాలు స్వీక‌రించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here