మాదాపూర్ డివిజ‌న్‌లో మంత్రి కెటిఆర్ చేతుల‌మీదుగా ర‌హ‌దారుల ప్రారంభం

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: శేరిలింగంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని మాదాపూర్ డివిజన్ లో రూ. 25 కోట్ల వ్య‌యంతో నిర్మించిన ర‌హ‌దారుల ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మాన్ని రాష్ట్ర మంత్రి కెటిఆర్ చేతుల మీదుగా సోమ‌వారం శంఖుస్థాప‌న కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌నున్న‌ట్లు ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ పేర్కొన్నారు. శ‌నివారం కార్య‌క్ర‌మ ఏర్పాట్ల‌ను ఆయ‌న అధికారుల‌తో క‌లిసి ప‌ర్య‌వేక్షించారు. ఈ సంద‌ర్భంగా గాంధీ మాట్లాడుతూ నోవాటేల్ హోటల్ నుండి కొండాపూర్ ఆర్‌టిఏ ఆఫీస్ వరకు నిర్మించిన బిటి రోడ్డు లింక్ రోడ్డు, మియాపూర్ మెట్రో డిపో నుండి కొండాపూర్ మసీదు జుంక్షన్ వరకు నిర్మించిన బిటి లింక్ రోడ్డు, వసంత సిటీ నుండి న్యాక్‌ వరకు నిర్మించిన బిటి లింక్ రోడ్డు, జెవి హిల్స్ పార్క్ నుండి మసీదు బండ వరకు నిర్మించిన బిటి లింక్ రోడ్డుల‌ను ఉద‌యం 10గం.ల‌కు మంత్రి కెటిఆర్ ప్రారంభించ‌నున్న‌ట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో అధికారులు జియాఉద్దీన్ , రహమాన్ , సర్ధార్ సింగ్, మాదాపూర్ డివిజన్ తెరాస పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

ర‌హ‌దారుల ప్రారంభోత్స‌వ ఏర్పాట్ల‌ను ప‌రిశీలిస్తున్న ప్ర‌భుత్వ విప్ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here