మియాపూర్(నమస్తే శేరిలింగంపల్లి): జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు డిసిపి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. సోమవారం మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని న్యూహఫీజ్ పేట్ లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. పోలీసుల మార్చ్ హఫీజ్ పెట్ ఆదిత్యనగర్, సుభాష్ చంద్ర బోస్ నగర్, ప్రేమ్ నగర్, మార్తాండ నగర్ ల మీదుగా సాగింది.

అనంతరం నిర్వహించిన సమావేశంలో డిసిపి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ పరిధిలో 20 సున్నితమైన పోలింగ్ కేంద్రాలు, 5 అతిసున్నితమైన పోలింగ్ కేంద్రాలపై దృష్టి సారించామన్నారు. శాంతి భద్రతలకు ఎలాంటి భంగం కలుగకుండా ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం లో మియాపూర్ ఏసిపి కృష్ణ ప్రసాద్, ఇన్స్పెక్టర్ వెంకటేష్ సామల లతో పాటు సబ్ ఇన్స్పెక్టర్లు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
