మాదాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): హైదరాబాద్ అభివృద్ధి చెందాలంటే తెరాసకు ఓటు వేయాలని మాదాపూర్ డివిజన్ తెరాస కార్పొరేటర్ అభ్యర్థి వి.జగదీశ్వర్ గౌడ్ అన్నారు. సోమవారం ఎన్నికల ప్రచార పర్వంలో భాగంగా నాయకులు, కార్యకర్తలతో కలిసి డివిజన్ పరిధిలోని ఆదిత్య నగర్, కృష్ణ కాలనీలో ప్రచారాన్ని నిర్వహించారు. ప్రజల కోసం నిరంతరం పనిచేసేది టిఆర్ఎస్ పార్టీయేనన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించి ఆశీర్వదించాలని కోరారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ విడుదల చేసిన తెరాస జీహెచ్ఎంసీ ఎన్నికల మేనిఫెస్టోపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. పేద ప్రజలకు న్యాయం చేసే విధంగా నాయీ బ్రాహ్మణులకు, దోబీ ఘాట్‌లకు ఉచిత్ విద్యుత్‌ను అందిస్తామని ప్రకటించడం, గ్రేటర్ ప్రజలకు ఉచితంగా మంచినీటి సౌకర్యాన్ని కల్పిస్తామని చెప్పడం అభినందనీయమన్నారు. ప్రజలు అభివృద్ధిని చూసి ఓటు వేయాలని కోరారు.







