శేరిలింగంపల్లిలో ఘనంగా సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు
మియాపూర్(నమస్తే శేరిలింగంపల్లి): బంజారాలకు దిశా నిర్దేశం చేసి వారిని మంచి మార్గంలో నడిపించేందుకు మూడు దశాబ్దాల క్రితం బంజారా సమాజంలో ఉదయించిన సూర్యుడు సంత్ సేవాలాల్ మహరాజ్ అని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె.అరుణ అన్నారు. సోమవారం సంత్ సేవాలాల్ జయంతి సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని మియపూర్ డివిజన్ నడిగడ్డ తాండ గిరిజన సంక్షేమ సంఘము ఆధ్వర్యంలో భోగ్ బండారో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకలకు మాజీ ఎంపి ప్రొఫెసర్ సీతారాం నాయక్ తో కలిసి డికె.అరుణ ముఖ్యఅతిథిగా హజరయ్యారు.

ఈ సందర్భంగా డి.కె అరుణ మాట్లాడుతూ దేశం అంతా తిరిగుతూ చిన్నాభిన్నంగా ఉన్న బంజారా సమాజాన్ని ఏకం చేయడంలో సేవాలాల్ మహారాజ్ ఎంతగానో కృషి చేశారన్నారు. బంజారాల సంస్కృతికి ఆధ్యాత్మికతను జోడిస్తూ దేశమంతా సంచరిస్తూ మూఢ నమ్మకాలు విడనాడి స్వచ్ఛమైన జీవనం కొనసాగించాలని బంజారాలకు హితబోధ చేశాడని కొనియాడారు. నేడు ఆయన జయంతిని దేశమంతా ఒక పండుగలా జరుపుకుంటున్నారని తెలిపారు. సీతారాం నాయక్ మాట్లాడుతూ బంజారాలకే కాక యావత్ సమాజానికి ఆదర్శప్రాయంగా నిలిచిన సేవాలాల్ మహరాజ్ జీవితాన్ని చరిత్రను పాఠ్యపుస్తకాలలో చేర్చాలని బంజారా నాయకులు కోరారు. ఆయన జయంతిని సెలవుదినంగా ప్రకటించాలని, సేవాలాల్ విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు జ్ఞానేంద్రప్రసాద్, కసిరెడ్డి భాస్కరరెడ్డి, రవికుమార్ యాదవ్, రాచమళ్ల నాగేశ్వర్‌గౌడ్, డి.ఎస్.ఆర్.కె.ప్రసాద్, మూల అనిల్ కుమార్ గౌడ్, డి.ఎస్.ఆర్.కె.ప్రసాద్, సమ్మెట ప్రసాద్, రాఘవేందర్‌రావు, కసిరెడ్డి సింధు రఘునాథ్ రెడ్డి, ఎఐబిఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు శ్యాం నాయక్, ఆర్ ఎఫ్ నాయక్, మోహన్ సింగ్, చంద్ నాయక్, నడిగడ్డ తాండ నాయకులు హనుమా నాయక్, రెడ్యా నాయక్, శంకర్ నాయక్, సీతారాం నాయక్ , తుకారాం నాయక్, హరి నాయక్, రవీందర్ , తిరుపతి నాయక్ , మధు నాయక్ లతో పాటు బంజారా సోదరులు తదితరులు పాల్గొన్నారు.
శేరిలింగంపల్లిలో…
శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని ఆర్‌జికె కాలనీలో స్థానిక నాయకులు ఆనంద్ నాయక్ ఆధ్వర్యంలో సంత్ సేవాలాల్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బంజారా యువకులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సేవాలాల్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ వేడుకల్లో కట్రావత్ జైపాల్ నాయక్, రాథోడ్ గోపాల్ నాయక్, రాథోడ్ రవీందర్ నాయక్, వార్డు మెంబర్ శ్రీకల, పద్మినీ భాయ్, సందయ్య నగర్ బస్తీ కమిటీ అధ్యక్షులు బస్వరాజు, గోపినగర్ బస్తీ కమిటీ అధ్యక్షులు గోపాల్ యాదవ్, పట్లోళ్ల నర్సింహారెడ్డి, గౌతమి, శేఖర్ రెడ్డి, సుధాకర్, కుమారి, కల్యాణి, నర్సింహారావు, రాఖీ, జైపాల్ తదితరులు పాల్గొన్నారు.

గచ్చిబౌలిలో…
సద్గురు సంత్ సేవాలాల్ మహరాజ్ 282వ జయంతి వేడుకలను గోపన్‌పల్లి తాండ నాయకులు హనుమత్ నాయక్ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు శేరిలింగంపల్లి బిజెపి నాయకులు ఎం.రవికుమార్‌యాదవ్, కార్పొరేటర్ గంగాధర్ రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సేవలాల్ జయంతి కమిటీ సభ్యులతో కలసి పాల్గొని మహరాజ్ కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకల్లో బంజారా యువకులు, తండావాసులు తదితరులు పాల్గొన్నారు.

చందానగర్‌లో…
సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను స్థానిక బంజారా నాయకులు శ్రీనివాస్ నాయక్ ఆధ్వర్యంలో చందానగర్ హుడా కాలనీలో నిర్వహించారు. ఈ సందర్భంగా హుడాకాలనీ సాయిబాబ గుడి నుండి ఎంఐజి ఫేజ్-2 లోగల సేవాలాల్ మహారాజ్ మందిరం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా కార్పొరేటర్ రాగంనాగేందర్ యాదవ్, చందానగర్ టిఆర్ ఎస్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, ఉరిటి వెంకట్రావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సేవాలాల్ మహారాజ్‌కు ప్రత్యేక పూజలు చేశారు. ఈ వేడుకల్లో బంజారా నాయకులు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
