శేరిలింగంప‌ల్లిలో ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీకి పాలాభిషేకాలు… బిజెపి నాయ‌కుల‌ నీరాజ‌నాలు

న‌మ‌స్తే శేరిలింగంపల్లి: భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ ప్ర‌క‌టించిన దేశ ప్ర‌జ‌లంద‌రికీ ఉచితంగా వ్యాక్సిన్ పంపిణీ, దీపావ‌ళి వ‌ర‌కు పేద ప్ర‌జ‌ల‌కు ఉచిత‌ రేష‌న్ స‌ర‌ఫరాపై శేరిలింగంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గ బిజెపి నాయ‌కులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. మంగ‌ళ‌వారం నియోజ‌క‌వ‌ర్గంలోని ప‌లు ప్రాంతాల్లో న‌రేంద్ర‌మోదీ చిత్ర‌ప‌టానికి పాలాభిషేకాలు చేసి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

కొండాపూర్‌లో…
కొండాపూర్ డివిజ‌న్ ప‌రిధిలోని అంజ‌య్య‌న‌గ‌ర్ చౌర‌స్తాలో డివిజ‌న్ బిజెపి నాయ‌కుల ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మానికి ముఖ్యఅతిథిగా శేరిలింగంప‌ల్లి అసెంబ్లీ బీజేపీ ఇంచార్జ్ గజ్జ‌ల యోగానంద్ హాజ‌రై న‌రేంద్ర‌మోదీ చిత్ర‌ప‌టానికి పాలాభిషేకం చేశారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ జూన్ 21వ తేదీ నుండి దేశంలో ఉన్న 18సం.లు పైబ‌డిన ప్రజలందరికీ ఉచితంగా కోవిడ్ వ్యాక్సిన్ అంద‌జేస్తామ‌ని, లాక్‌డౌన్ కార‌ణంగా ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న దేశంలోని 80 కోట్ల పేద‌ ప్రజలకు అండగా నిలిచేందుకు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద ఉచితంగా నవంబర్(దీపావళి) వరకు రేషన్ అంద‌జేస్తామ‌ని ప్ర‌క‌టించ‌డం గొప్ప‌విష‌య‌మ‌ని తెలిపారు. దేశ ప్ర‌జ‌ల సంక్షేమం కోసం అసాధార‌ణ నిర్ణ‌యాల‌తో పాల‌న అందిస్తున్న మోదీకి కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్నామ‌ని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా ఉపాధ్యక్షులు పోరెడ్డి బుచ్చి రెడ్డి, బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చింతకింది గోవర్ధన్ గౌడ్, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి మారం వెంకట్, బీజేపీ జిల్లా కార్యదర్శి అనిల్ గౌడ్, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి కుమ్మరి జితేందర్, బీజేపీ డివిజన్ మాజీ అధ్యక్షులు ఎం.ఆంజనేయులు సాగర్, బీజేపీ నాయకులు ఆత్మారాం, రఘు , మన్నెంకొండ సాగర్ ,కృష్ణ రామ్ సుతార్, జి, రవీందర్ సాగర్ ర్, డి లక్ష్మయ్య, కె వెంకటేష్ సాగర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ చిత్ర‌ప‌టానికి పాలాభిషేకం చేస్తున్న గ‌జ్జ‌ల యోగానంద్‌

కేంద్రం ఉచితంగా వ్యాక్సిన్ అందించ‌డం హ‌ర్ష‌ణీయం: ర‌వికుమార్‌యాద‌వ్‌
ప్ర‌జ‌ల‌కు, రాష్ట్ర ప్ర‌భుత్వాలపై ఆర్థిక భారం ప‌డ‌కుండా కేంద్ర ప్ర‌భుత్వ‌మే ఉచితంగా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ నిర్వ‌హించ‌డం హ‌ర్ష‌ణీయ‌మ‌ని బిజెపి రాష్ట్ర నాయ‌కులు ర‌వికుమార్‌యాద‌వ్ అన్నారు. మంగ‌ళ‌వారం గ‌చ్చిబౌలి డివిజ‌న్ లో స్థానిక కార్పొరేట‌ర్ గంగాధ‌ర్‌రెడ్డి ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మానికి ముఖ్యఅతిథిగా హాజ‌రైన ర‌వికుమార్‌యాద‌వ్ న‌రేంద్ర‌మోదీ చిత్ర‌పటానికి పాలాభిషేకం చేశారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఉచితంగా వ్యాక్సినేషన్ ఇవ్వ‌నున్న‌ట్లు ప్రకటించడం చాలా సంతోషకరమైన విషయ‌మ‌న్నారు. కేంద్రమే వ్యాక్సీన్ కొనుగోలు చేసి దేశంలో ఉన్న పేద, మధ్య, ఉన్నత వర్గాల ప్రజలకు కూడా ఉచితంగా అందిచాలని ప్రధాని నిర్ణ‌యించ‌డం గొప్ప విషయమ‌ని, దేశ ప్రజల ఆరోగ్యానికి బిజెపి ప్రభుత్వం ఎంతటి ప్రాధాన్యత‌నిస్తుందో ఈ నిర్ణ‌యంతో స్ఫ‌ష్ట‌మ‌వుతుంద‌న్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేవైఎం కోశ అదికారి మారబోయిన రఘునాథ్ యాదవ్ , రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, సీనియర్ నాయకులు, కసిరెడ్డి రఘునాథ్ రెడ్డి, పోచయ్య, వెంకటేష్ యాదవ్, శివ సింగ్, శంకర్ యాదవ్ , తిరుపతి, సుబ్రమణ్యం, శ్రీనివాస్, రమేష్, ప్రకాష్, విష్ణు తదితరులు పాల్గొన్నారు.

ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ చిత్ర‌ప‌టానికి పాలాభిషేకం చేస్తున్న ర‌వికుమార్‌యాద‌వ్‌

మియాపూర్ లో ప్రధానికి పాలాభిషేకం…
మియాపూర్, హఫీజ్ పేట్ డివిజన్ ల బి.జె.పి ఆధ్వర్యంలో మియాపూర్ అర్.బి.అర్. కాంప్లెక్స్ వ‌ద్ద‌ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి డివిజ‌న్ నాయ‌కులు పాలాభిషేకం చేశారు. దేశ ప్ర‌జ‌ల కోసం ప్ర‌ధాని మోదీ తీసుకున్న నిర్ణ‌యాల ప‌ట్ల హ‌ర్షం వ్య‌క్తం చేసిన నాయ‌కులు మిఠాయిలు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో బి.జె.పి. రంగారెడ్డి అర్బన్ జిల్లా ఉపాధ్యక్షులు డి.ఎస్.అర్.కె.ప్రసాద్, జిల్లా ఓ.బి. సి. మోర్చ అధ్యక్షులు అర్.నాగేశ్వర్ గౌడ్, నాయకులు మనోహర్, హఫీజ్ పేట్ డివిజన్ అధ్యక్షులు శ్రీధర్ రావు, మియాపూర్ డివిజన్ కార్యదర్శి ఆకుల లక్ష్మణ్, రామకృష్ణారెడ్డి, రవి గౌడ్, వీర ప్రసాద్, అంజయ్య, నారాయణ రెడ్డి, బాబు రెడ్డి, డేవిడ్, విజయేందర, శ్రీనాథ్ రెడ్డి, కోటేశ్వర రావు, వెంకట్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

న‌రేంద్ర‌మోదీకి పాల‌భిషేకం నిర్వ‌హిస్తున్న మియాపూర్‌, హ‌ఫీజ్పేట్ డివిజ‌న్‌ల బిజెపి నాయ‌కులు

మ‌ధురాన‌గ‌ర్‌లో…
గచ్చిబౌలి డివిజన్ ప‌రిధిలోగ‌ల మధురానగర్ లో గచ్చిబౌలి డివిజన్ ఉపాధ్య‌క్షులు వెంకటేష్ ఆధ్వర్యంలో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో రంగారెడ్డి జిల్లా అర్బ‌న్ కార్య‌ద‌ర్శి మూల అనిల్‌గౌడ్‌ భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఉచిత వ్యాక్సినేష‌న్‌, రేష‌న్ పంపిణీ నిర్ణ‌యం ప‌ట్ల ప్ర‌ధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో గచ్చిబౌలి డివిజన్ మహిళా మోర్చా అధ్యక్షురాలు మహేశ్వరి, పూజ, రఘు కొవ్వూరి, ఐటి సెల్ నాయ‌కులు శ్రీనివాస్ చారి త‌దిత‌రులు పాల్గొన్నారు.

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ చిత్ర‌ప‌టానికి పాలాభిషేకం చేస్తున్న మూల అనిల్‌గౌడ్‌

భారతదేశ ప్రధాని నరేంద్రమోదీ ప్రజల మనిషి: బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్
దేశ ప్ర‌జ‌ల సంక్షేమాన్ని ప్ర‌తినిత్యం కోరుకునే ప్ర‌ధాని నరేంద్ర‌మోదీ ప్ర‌జ‌ల మ‌నిషి అని బీజేపీ రాష్ట్ర కార్య‌వ‌ర్గ స‌భ్యులు జ్ఞానేంద్ర‌ప్ర‌సాద్ అన్నారు. జూన్ 21వ తేదీ నుండి 18 సం.లు పైబ‌డిన వారంద‌రికీ ఉచిత వ్యాక్సినేష‌న్‌, పేద ప్ర‌జ‌ల‌కు దీపావ‌ళి వ‌ర‌కు ఉచిత రేష‌న్ పంపిణీ నిర్ణ‌యంపై మోదీకి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. రాష్ట్రాలు ఒక్క రూపాయు కూడా ఖర్చు చేయనవసరం లేకుండా మొత్తం కేంద్రమే వ్యాక్సీన్ కొనుగోలు చేసి దేశంలో ఉన్న పేద, మధ్య, ఉన్నత వర్గాల ప్రజలకు ఉచితంగా అందిచాలని ప్రధాని నిర్ణయం తీసుకోవడం చాలా గొప్ప విషయం అని అన్నారు. దేశ హితం కోసం మరోసారి ప్రధాని తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. అంతే కాకుండా దీపావళి వరకు దేశంలో గరీబ్ కళ్యాణ్ యోజన ద్వారా పేదలకు తలా 5 కిలోల బియ్యం పంపిణి కొనసాగిస్తామని ప్రకటించినందుకు తెలంగాణ ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నామ‌ని తెలిపారు. ప్రపంచంలోనే ఏ నాయకుడు తీసుకొనటువంటి నిర్ణయాన్ని తీసుకొని దేశ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటున్న నాయకుడు అని దేశ ప్రజలు కొనియాడుతున్నార‌ని తెలిపారు.

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here