నమస్తే శేరిలింగంపల్లి: హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని ఖాయిదమ్మకుంట చెరువు నుండి సితార హోటల్ వరకు రూ.8.00 కోట్లతో చేపడుతున్న నాలా విస్తరణ పనులను, గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల హుడా కాలనీ నుండి పార్క్ వరకు దాదాపు రూ. 40 లక్షల అంచనావ్యయంతో చేపడుతున్న, చందానగర్ డివిజన్ పరిధిలోని రేగులకుంట నుండి గంగారాం పెద్ద చెరువు వరకు. రూ 38 లక్షల అంచనావ్యయంతో చేపడుతున్న వరదనీటి కాలువ పనులను, దీప్తిశ్రీ నగర్ సీబీఆర్ ఎస్టేట్స్ వద్ద కొనసాగుతన్న నాలా విస్తరణ పనులను మంగళవారం ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలం సమీపించిన నేపథ్యంలో నాలాలు, వరదనీటి కాలువ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలిపారు. కాలువల నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదకన చేపట్టి ముంపు ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని అధికారులకు ఆయన సూచించారు. అభివృద్ధి పనుల విషయంలో రాజీ పడితే సహించేంది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో చందానగర్ సర్కిల్ ఈఈ శ్రీకాంతిని, డీఈ రూప దేవి, ప్రాజెక్టు ఏఈ శివ కృష్ణ వర్క్ ఇన్స్పెక్టర్ జగదీష్, శేరిలింగంపల్లి సర్కిల్ డీఈ శ్రీనివాస్, ఏఈ కృష్ణ వేణి, వర్క్ ఇన్‌స్పెక్టర్ విశ్వనాథ్ టీఆర్ఎస్ హఫీజ్‌పేట్ డివిజన్ అధ్యక్షులు బాలింగ్ గౌతమ్ గౌడ్, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ నాయకులు శాంతయ్య, రవి కుమార్, సురేష్, వెంకట్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.