లాక్‌డౌన వేళ నిరుపేద‌ల క‌డుపునింపుతున్న ర‌వికుమార్ యాద‌వ్‌కు రుణ‌ప‌డి ఉంటాం: గుండె గ‌ణేష్ ముదిరాజ్‌

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: ర‌వికుమార్ యాద‌వ్(ఆర్‌కేవై) ప్రాణ‌హేతు ఆద్వ‌ర్యంలో మియాపూర్ డివిజ‌న్ ప‌రిధిలోని జేపీఎన్‌నగర్‌లో మంగ‌ళ‌వారం నిరుపేద‌ల‌కు ఉచితంగా భోజ‌నం పంపిణీచేశారు. స్థానిక‌ పారిశుద్ధ్య కార్మికులకు, బీహార్ వ‌ల‌స కార్మికులకు, భవన నిర్మాణ కార్మికులకు పెద్ద‌మొత్తంలో ఆర్‌కేవై టీం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి గుండె గ‌ణేష్ ముదిరాజ్ ఆహార ప్యాకెట్ల‌ను అంద‌జేశారు. ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ లాక్‌డౌన్ కార‌ణంగా నిరుపేద‌లు, కార్మికులు ఆక‌లితో అల‌మ‌టించ‌రాద‌ని, బిజెపి రాష్ట్ర నాయ‌కులు ర‌వికుమార్ యాద‌వ్ నిండు మ‌న‌సుతో ప్ర‌తిరోజు భోజ‌నం పంపిస్తున్నార‌ని అన్నారు. ఆర్‌కేవై ప్రాణ‌హేతు ద్వారా వాడ‌వాడ‌లో భోజనాన్ని పంపిణీ చేస్తున్న‌ట్టు తెలిపారు. అదేవిధంగా ఉపాధి కోల్పోయిన నిరుపేద కుటుంబాల‌కు నిత్యావ‌స‌ర స‌రుకుల‌ను పంపిణీ చేస్తున్న‌ట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్‌కేవై టీం స‌భ్యులు వినోద్ యాదవ్, ఆకుల లక్ష్మణ్ ముదిరాజ్, జాజిరావు, శీను, రాము, సోను కుమార్ యాదవ్, గేదెల శివ, సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

జేపీఎన్ న‌గ‌ర్‌లో పారిశుద్య కార్మికుల‌కు భోజ‌నం పంపిణీ చేస్తున్న గుండె గ‌ణేష్ ముదిరాజ్‌, వినోద్ యాద‌వ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here