చందానగర్ లో నిరుపేదలకు సీడ్స్ అండ్ హనీ వెల్ సంస్థ నిత్యావసరాల పంపిణీ

నిరుపేదలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తున్న కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి, సీడ్స్ అండ్ హనీ వెల్ సంస్థ ప్రతినిధులు

చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ లోని నిరుపేదలకు స్థానిక కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డి చేతులమీదుగా నిత్యావసరాల శుక్రవారం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి మాట్లాడుతూ కారోనా సమయం లో ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్న పేదలను గుర్తించి వారికి ఒక్కొక్కరికి ఒక నెల రోజులకు సరిపడా నిత్యావసరాల సరుకులను అందచేసిన సీడ్స్ అండ్ హనీ వెల్ సంస్థ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిత్యావసరాల కిట్ లో 10 కిలోల బియ్యం,5 కిలోల గొదుమపిండి,2 కిలోల కందిపప్పు, కిలో నూనె, కిలో చెక్కర, కిలో ఉప్పు, మొదలగు నిత్యావసర వస్తువులున్నాయని, మొత్తం 200 మందికి అందచేయటం జరిగిందన్నారు.ఈ యొక్క కార్యక్రమంలో సీడ్స్ అండ్ హనీ వెల్ సంస్థ వారు శ్రీనివాస్ రెడ్డి,నరేందర్ ,పర్నంది శ్రీకాంత్, ప్రకాష్, రమణకుమారి, రాధిక, సలీం, రాజన్న, చందర్ రావు, రామా రావు, పోచయ్య, అనంత రెడ్డి, శోభ, ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు.

నిత్యావసర వస్తువులను పొందిన నిరుపేదలతో కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి, సీడ్స్ అండ్ హనీ వెల్ సంస్థ ప్రతినిధులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here