- ఎమ్మెల్యే గాంధీని కలిసి వినతిపత్రం సమర్పించిన కాలనీవాసులు
నమస్తే శేరిలింగంపల్లి : హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని సప్తగిరి కాలనీ లోని పలు సమస్యలు, చేపట్టవల్సిన పలు అభివృద్ధి పనుల పై కాలనీ వాసులు ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీని మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు.
ఈ సంధర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని సప్తగిరి కాలనీ లో నెలకొన్న పలు సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని, కాలనీలో అసంపూర్తిగా మిగిలిపోయిన డ్రైనేజీ, రోడ్డు పనులు త్వరలోనే పూర్తి చేస్తామని, సప్తగిరి కాలనీ అభివృద్ధి కి శాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు వెంకట్ యాదవ్, నందు, అర్జున్, శ్రీరాములు, నర్సింలు, శ్రీనివాస్, చెంచు రామయ్య, శ్రీధర్, వెంకటేష్, సురేష్ కాలనీ వాసులు పాల్గొన్నారు.