నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం, కొండాపూర్ డివిజన్, సిద్దిక్ నగర్, అంజయ్య నగర్ కాలనీలో అప్పల వినోద్ యాదవ్, గణేష్ యాదవ్ , కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా సదర్ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న జాతీయ బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు భేరీ రాంచందర్ యాదవ్ మాట్లాడుతూ యాదవులు ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా జరుపుకునే పండుగ సదర్ పండుగ అని అన్నారు. పశు సంపద వల్ల దేశానికి ఎంతో ఎంతో మేలు జరుగుతుందని, పశుసంపదని కాపాడుకోవాల్సిన బాధ్యత మనతోపాటు ప్రభుత్వాలపై ఉందన్నారు. ప్రభుత్వాలు పశుపోషణకై సబ్సిడీ దాణాలు, సబ్సిడీ కింద పశువులను రైతన్నలకు అందించాలన్నారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ దీపావళి, సదర్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో బిజెపి పార్టీ రాష్ట్ర కోశాధికారి మారబోయిన రఘునాథ్ యాదవ్, బిజెపి పార్టీ అందెల కుమార్ యాదవ్, ఉత్సవ నిర్వాహకులు వినోద్ యాదవ్, గణేష్ యాదవ్, 104 డివిజన్ యువమోర్చ ఉపాధ్యక్షుడు తేజ, చందు, ఇమ్రాన్, దత్తు ముదిరాజ్ పాల్గొన్నారు.