ఆర్టీసి కార్మికుల‌కు భోజ‌న వ‌స‌తి క‌ల్పించిన జ్ఞానేంద్ర ప్ర‌సాద్‌

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: లాక్‌డౌన్ కార‌ణంగా విధినిర్వ‌హ‌ణ‌లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆర్టీసి కార్మికుల‌కు భోజ‌న స‌దుపాయం క‌ల్పించ‌డం త‌మ బాధ్య‌త‌గా భావిస్తున్నామ‌ని వివేకానంద స‌మితి గౌర‌వ అధ్య‌క్షులు జ్ఞానేంద్ర‌ప్ర‌సాద్ అన్నారు. బిఎంఎస్ నాయ‌కుల ఆధ్వ‌ర్యంలో అక్ష‌య‌పాత్ర సంస్థ స‌హకారంతో ఏర్పాటు చేసిన భోజ‌నాన్ని ఆర్టీసి డిపోల్లో కార్మికుల‌తో పాటు హ‌ఫీజ్‌పేట‌, లింగంప‌ల్లి, కొండాపూర్‌, సిద్ధిఖ్‌న‌గ‌ర్‌, రాఘ‌వేంద్ర‌కాల‌నీ, పాపిరెడ్డి కాల‌నీ త‌దిత‌ర ప్రాంతాల్లో వ‌ల‌స కూలీల‌కు అంద‌జేశారు. ఈ కార్య‌క్ర‌మంలో బిఎంఎస్ రాష్ట్ర సంఘటన కార్యదర్శి రామ్మోహన్ జీ, బిఎంస్ నాయకులు రమేష్, బాల గౌడ్, వివేకానంద సేవ సమితి ఉపాధ్యక్షులు పృథ్వి కాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ఆర్టీసి కార్మికుల‌కు భోజ‌న పొట్లాల‌ను అంద‌జేస్తున్న జ్ఞానేంద్ర‌ప్ర‌సాద్‌, బిఎంఎస్ నాయ‌కులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here