ఒకే రోజు, ఒకే వేదిక‌పై 36 వేల మందికి కోవాక్జీన్ టీకా… క‌రోనా క‌ష్ట‌కాలంలో చ‌రిత్ర‌ సృష్టించిన హైద‌రాబాద్‌…

  • హైటెక్స్‌లో ఉత్సాహంగా కోన‌సాగిన మేగా వ్యాక్సినేష‌న్ డ్రైవ్‌
  • మెడిక‌వ‌ర్ హాస్పిట‌ల్స్‌, సైబ‌రాబాద్ క‌మిష‌న‌రేట్‌, ఎస్‌సీఎస్‌సీ వినూత్న ప్ర‌యోగం విజ‌య‌వంతం

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: ప్ర‌పంచ వ్యాప్తంగా హైద‌రాబాద్ పేరు మ‌రోక్క‌సారి మారుమోగ్రింది. క‌రోనా వ్యాక్సినేష‌న్ డ్రైవ్‌లో చరిత్ర సృష్టించింది. క‌నీ వినీ ఎరుగ‌ని రీతిలో ఒకే రోజు, ఒకే చోట దాదాపు 40 వేల మంది కోవిడ్ వ్యాక్సినేష‌న్ వేయించుకున్నారు. న‌గ‌రంలోని హైటెక్స్ ఎక్జిబీష‌న్ సెంట‌ర్ ఈ మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్‌కు వేధిక‌య్యింది. మెడికవర్ హాస్పిటల్స్‌, సైబ‌రాబాద్ పోలీస్ క‌మిష‌నరేట్‌, సొసైటీ ఫర్‌ సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌(ఎస్‌సీఎస్‌సీ)లు సంయుక్తంగా ఏర్పాటుచేసిన ఈ డ్రైవ్‌లో ఒక్క‌రోజులోనే 40 వేల మంది వ్యాక్సిన్ కోసం త‌మ పేర్ల‌ను ఆన్‌లైన్‌లో రిజిస్ట‌ర్ చేసుకున్నారు. ఈ క్ర‌మంలోనే ఆదివారం హైటెక్స్ ప్రాంగ‌ణంలో ఉద‌యం 8 గంట‌ల నుంచి సాయంత్రం 7 గంట‌ల వ‌ర‌కు దాదాపు 36 వేల మందికి పైగా వ్యాక్సిన్ వేయించుకున్నారు. ప్ర‌స్థుతం కోవాక్జీన్ డోసుల కొరత ఉన్న త‌రుణంలో ఒకే రోజు ఇంత పెద్ద మొత్తంలో మొద‌టి డోసు పంపిణీ చేయడం విశేషం. ఈ విష‌యంలో మెడిక‌వ‌ర్ హాస్పిట‌ల్స్ త‌న స‌త్తా చాటుకుంది.

మేగా వ్యాక్సినేష‌న్ డ్రైవ్‌కు వ‌చ్చిన వేలాది వాహ‌నాల‌తో ఆక‌ట్టుకుంటున్న హైటెక్స్ ప్రాంగ‌ణం

ఈ కార్య‌క్ర‌మంలో ముఖ్య అతిథిలుగా పాల్గొన్న ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేని విదంగా ఈ రోజు మన ప్రాంతంలో 40వేల‌కు పైగా ప్రజలకు ఒకే రోజు మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను ఏర్పాటు చేయడం చాలా గర్వించదగ్గ విషయం అని అన్నారు. కరోనా సమస్యను అధిగమించేందుకు సమష్టి కృషి అవసరమన్నారు. కేవలం ఓ వ్యక్తి, సంస్థ, ప్రభుత్వంతో సాధ్యమయ్యేది. కాదని, ప్రతి ఒక్కరూ సమిష్టి తత్వంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. సైబ‌రాబాద్ సీపీ స‌జ్జ‌నార్ మాట్లాడుతూ మాట్లాడుతూ క‌రోనా మహమ్మారి వ్యాప్తి చెందకుండా నిరోధించేందుకు వ్యాక్సినేష‌న్ ఉత్త‌మ మార్గ‌మ‌న్నారు. ఈ టీకాల వ‌ల్ల‌ కోవిడ్‌ కేసులు పెరగకుండా నిరోధించడంతో పాటుగా థ‌ర్డ్ వేవ్‌ ప్రమాదాన్నీ నియంత్రించడంలో సహాయపడుతుందని అన్నారు. ఎస్‌సీఎస్‌సీ జనరల్‌ సెక్రటరీ కృష్ణ యెదుల మాట్లాడుతూ ప్రస్తుత సంక్షోభం నుంచి బయటపడేందుకు ఉన్న ఒకే ఒక మార్గం టీకా కార్యక్రమం అని తాము భావిస్తుండటం చేత ఈ మెగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌కు శ్రీకారం చుట్టామ‌న్నారు. మెడికవర్‌ గ్రూప్‌ హాస్పిటల్స్‌ ఇండియా ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్ హరికృష్ణ మాట్లాడుతూ ఎన్నో దేశాలలో మహమ్మారితో జరుగుతున్న పోరాటంలో ప్రభావవంతమైన మార్గంగా టీకాలు నిలుస్తున్నాయాన్నారు. అత్యధిక జనాభా కలిగిన మన లాంటి దేశాలలో ఈ తరహా భారీ టీకా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఎక్కువ మంది ప్రజలకు చేరుకోవడం సాధ్యమవుతుందన్నారు. ఈ డ్రైవ్‌కు స‌హ‌క‌రించిన ప్ర‌భుత్వానికి, సైబ‌రాబాద్ పోలీసుల‌కు, ప్ర‌త్యేకంగా విశేషంగా కృషి చేసిన త‌మ హాస్పిట‌ల్ వైద్య సిబ్బందికి ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

వ్యాక్సినేష‌న్ డ్రైవ్‌ను ఉద్ధేశించి మాట్లాడుతున్న ప్ర‌భుత్వ విప్ గాంధీ, వేదిక‌పై సైబ‌రాబాద్ సీపీ స‌జ్జ‌నార్‌, మెడిక‌వ‌ర్ హాస్పిట‌ల్స్ ఈడీ హ‌రికృష్ణ త‌దిత‌రులు

అదిరిపోయిన ఏర్పాట్లు… క్ష‌ణాల్లో వ్యాక్సిన్‌…
టీకా వేయించుకోవడానికి వచ్చిన వారెవరూ వేచి ఉండాల్సిన అవసరం లేకుండా హైటెక్స్‌లో మెడిక‌వ‌ర్ హాస్పిట‌ల్స్ ప్ర‌త్యేక ఏర్పాటు చేశారు. 300ల‌కు పైగా కౌంటర్లను ఏర్పాటు చేశారు. దాదాపు 500 మంది న‌ర్సులు, ఇత‌ర 900 మంది సిబ్బంది క‌ల‌పి మొత్తం 1400 మంది ఎనిమిది గంట‌ల‌పాటు నిరంత‌ర సేవ‌లందించారు. పాలిచ్చే తల్లుల కోసం నర్సింగ్‌ స్టేషన్లు, అత్యవసర ప‌రిస్థితుల్లో వైద్యం అందించేందుకు ఐదు పడకల చొప్పును ప్ర‌తి హ్యాంగ‌ర్‌లో ఒక ఎమ‌ర్జెన్సీ వార్డును ఏర్పాటుచేశారు. దాంతోపాటు టీకా వేయించుకోవడానికి వచ్చిన వారి కోసం టీ, కాఫీ, బిస్కెట్లను సైతం అందజేశారు. ట్రాఫిక్ నియంత్ర‌ణ‌లో సైబ‌రాబాద్ పోలీసులు ప్ర‌త్యేక శ్ర‌ద్ధ వ‌హించారు. పెద్ద‌మొత్తంలో కార్లు ఒక‌సారి సెంట‌ర్‌కు చేరుకోవ‌డంతో కొంత ఇబ్బంది త‌లెత్తిన‌ప్ప‌టికి ప్ర‌శాంత వాతావ‌రణంలో డ్రైవ్ విజ‌య‌వంతం అవ్వ‌డంలో కీల‌క పాత్ర పోషించారు. ఈ కార్య‌క్ర‌మంలో ప్రజా ఆరోగ్య సంచాలకులు డాక్టర్ జి.శ్రీనివాసరావు, జిల్లా వైద్యాధికారి డాక్టర్ స్వరాజ్య లక్ష్మి, మెడిక‌వ‌ర్ ఇండియా చైర్మ‌న్ డాక్టర్ అనిల్ కృష్ణ ఇత‌ర ప్ర‌ముఖులు పాల్గొన్నారు.

ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో వ్యాక్సిన్ వేయించుకుంటున్న న‌గ‌ర వాసులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here