నమస్తే శేరిలింగంపల్లి: రవికుమార్ యాదవ్(ఆర్ కే వై) టీం ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి నియోజకవర్గంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. లింగంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో నివసించే నిరుపేదలకు ఆహార పొట్లాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గంగారం మల్లెద్, గుండె గణేష్ ముదిరాజ్ లు మాట్లాడుతూ నిరంతరం ప్రజా సేవకోసం కంకణ బద్ధుడై పని చేస్తున్న రవికుమార్ యాదవ్ స్పూర్తితో పేదలకు తమ వంతు సేవ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీం సభ్యులు జాజె రావు, శ్రీను, వినోద్, రాము,సోను కుమార్ యాదవ్, కొంచ శివరాజ్ ముదిరాజ్, కొంచ బాబు ముదిరాజ్, గోపి, నారాయణ, వెంకటేష్ నాయక్, రమేష్, రాజేందర్, వెంకట్ గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.
