చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): పెద్దపల్లిలో హైకోర్టు న్యాయవాదులు వామనరావు, నాగమణి దంపతులను మండల టిఆర్ఎస్ పార్టీ నాయకుడు కుంట శ్రీను, అతని అనుచరులు అతి కిరాతకంగా నరికి చంపడాన్ని నిరసిస్తూ శేరిలింగంపల్లి మహిళా మోర్చా ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ప్రశ్నించే గొంతులను అణచివేస్తూ చివరికి చంపి వేయడం జరుగుతుందని, మహిళ అని కూడా చూడకుండా అతి కిరాతకంగా నరికి చంపిన కుంట శ్రీను, అతని అనుచరులకు ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి బిజెపి నాయకురాలు ప్రశాంతి, వివేకానంద నగర్ డివిజన్ బిజెపి ఇంచార్జ్ ఉప్పల విద్యా కల్పన ఏకాంత్ గౌడ్, చందానగర్ డివిజన్ బిజెపి ఇంచార్జ్ కసిరెడ్డి సింధు రెడ్డి, షాలిని, శృతి, తేజస్విని, బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
