నమస్తే శేరిలింగంపల్లి: హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని హుడా కాలనీలో నెలకొన్న సమస్యలపై డివిజన్ యూత్ విభాగం సభ్యులు జి.రోహిత్ ముదిరాజ్ కార్పొరేటర్ జగదీశ్వర్‌గౌడ్ తో చర్చించారు. హుడాకాలనీ పార్కులో ఉన్న గ్రంథాలయం, గంగారం, హుడాకాలనీ అంతర్గత రహదారులు తదితర సమస్యలను రోహిత్ కార్పొరేటర్ కు వివరించారు. సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. వీటిపై స్పందించిన జగదీశ్వర్‌గౌడ్ అధికారులను ఫోన్‌లో సంప్రదించి సమస్యల స్థితిగతులపై సమీక్షించారు. రోడ్డు పనులను త్వరలోనే ప్రారంభిస్తామని, గ్రంథాలయ సమస్యలను సైతం త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
