స్పందించారా.. సిగ్గుండాలి

  • ప్రభుత్వ జీవోలు అమలుకు మాత్రమే ఆచరించడంలో శూన్యం
  • రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్రంగా ఖండించిన బిజేపీ రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్
  • ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలి: కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి
  • మహిళలపై ఆగత్యాలపై రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి:  కన్వీనర్ రాఘవేంద్రరావు
మాదాపూర్ డివిజన్ చార్మినార్ కమాన్ వద్ద మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిరసన తెలుపుతున్న బిజేపీ రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్, కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి తదితరులు

నమస్తే శేరిలింగంపల్లి : ఒకటి కాదు, రెండు కాదు తెలంగాణ రాష్ట్రంలో నిత్యం మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అనుమానాస్పదంగా ఉందని బిజెపి పార్టీ రాష్ట్ర నాయకుడు రవి కుమార్ యాదవ్ అన్నారు. మాదాపూర్ డివిజన్ చార్మినార్ కమాన్ వద్ద మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమంలో మాట్లాడారు.  ఒక నిరుపేద ఆడబిడ్డ ఒక మెడికల్ విద్యార్థి ఎస్.టి బిడ్డ ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఆ స్థాయికి చేరుకుందని, అలాంటి అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నదంటే నమ్మే విధంగా లేదని, ఆ సైఫ్ ఇంజెక్షన్ ఇచ్చి చంపి ఉంటాడని మండిపడ్డారు. మన ఇంట్లో  వాళ్లకు ఇలాంటివి జరిగితే మన ఎంత బాధపడతాం, ఇలాంటివి మన తెలంగాణలో ఇలాంటివి ఎన్నో జరుగుతున్నా బి.ఆర్.ఎస్ నాయకులు స్పందించారా! సిగ్గుండాలి ఎద్దేవ చేశారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి కన్వీనర్ రాఘవేంద్రరావు, మహిళా మోర్చా కన్వీనర్ కొత్తపెళ్లి పద్మ, రాధాకృష్ణ యాదవ్, శ్రీనివాస్ యాదవ్, మధు, రేణుక, అరుణ, మహేశ్వరి, భారతి, శ్రీలత, దేవి రెడ్డి, విజయలక్ష్మి, సుశీల, నాగు బాయ్, పార్వతి, జ్యోతి, లక్ష్మి, బాలమ్మ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here