నమస్తే శేరిలింగంపల్లి : కొండాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ యువ జన నాయకుడు షేక్ ఆదిల్ పటేల్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ ధరలు పెంపు విధానానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు, ప్రభుత్వ విప్ ఆరేకపూడి గాంధీ పిలుపు మేరకు, కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ సూచనలతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. కొండాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్ కాలనీలోని కార్పొరేటర్ కార్యాలయం దగ్గర ఉన్న చౌరస్తా కూడలిలో బీఆర్ఎస్ అధ్యక్షులు, కార్యకర్తలు, నాయకులు, ప్రజలతో కలసి గ్యాస్ ధరల పెంపునకు వ్యతిరేకంగా, కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేసి, కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు.
ఈ సందర్బంగా ఆదిల్ పటేల్ మాట్లాడుతూ మోదీ మహిళలకు మహిళా దినోత్సవం కానుకగా గ్యాస్ ధరలను పెంచారా అని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగారు. ఆ మహిళలు, గృహిణులే త్వరలో మోదీకి గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ కొండాపూర్ డివిజన్ అధ్యక్షుడు అబ్బుల కృష్ణ గౌడ్, సెక్రటరీ జె బలరాం యాదవ్, సీనియర్ నాయకులు కరీం లాలా, నరసింహా సాగర్, రూపారెడ్డి, కె. నిర్మల, తిరుపతి యాదవ్, రామకృష్ణ, హినాయత్, సైబర్ హిల్స్ భాస్కర్ రెడ్డి, వెంకటేష్, శ్యామల, డా రమేష్, యాదగిరి, గిరి గౌడ్, రామస్వామి గౌడ్, సత్యం గౌడ్, శ్రీనివాస్ గౌడ్, సంతోష్ అబేద్ అలీ, రజనీకాంత్, గణపతి, మొహ్మద్ కలీం, రవి శంకర్ నాయక్, హీనాయత్, అశోక్ సాగర్, మొహ్మద్ అబ్దుల్ కరీం, కేశం కుమార్, నీలం లక్ష్మణ్, స్వామి సాగర్, మొహ్మద్ ఖాసీం, సిద్దిఖ్ నగర్ ప్రెసిడెంట్ బసవరాజు, న్యూ పిజెఆర్ నగర్ ప్రెసిడెంట్ వెంకటి, తెప్ప బాలరాజు, డి. విజయ్ కుమార్, సిద్దు, మధు ముదిరాజ్, కలీం, షేక్ జలీల్ అహ్మద్, పూజ, వెంకటేష్, సందీప్, సంజు, శివ, సయ్యద్ ఉస్మాన్, పూజ, ఆంజనేయులు, అంజాద్ అమ్ము, కచ్చావా దీపక్, షేక్ రఫీ, అభి అక్షయ్, వసీమ్, సిద్దు, జహంగీర్ పాల్గొన్నారు.