రాష్ట్ర స్థాయి మాస్ట‌ర్ అథ్లెటిక్స్‌లో స‌త్తా చాటిన రంగారెడ్డి జిల్లా క్రీడాకారులు:‌నూనె సురేంద‌ర్‌

చందాన‌గ‌ర్‌(న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ‌తెలంగాణ రాష్ట్ర 7వ మాస్ట‌ర్స్ అథ్లెటిక్స్ పోటీల‌లో రంగారెడ్డి జిల్లాకు చెందిన క్రీడాకారులు ఉత్త‌మ ప్ర‌తిభ క‌న‌బ‌రిచిన‌ట్లు అథ్లెటిక్స్ అసోసియేష‌న్ జిల్లా ప్ర‌ధాన‌కార్య‌ద‌ర్శి నూనె సురేంద‌ర్ తెలిపారు. ఈ నెల 13, 14 తేదీల‌లో మ‌ల్లారెడ్డి ఇంజనీరింగ్ క‌ళాశాల క్యాంప‌స్‌లో నిర్వ‌హించిన ఈ క్రీడా పోటీల్లో 18 జిల్లాల‌కు చెందిన దాదాపు 700 మంది క్రీడాకారులు పాల్గొన్న‌ట్లు తెలిపారు. పోటీల్లో పాల్గొన్న రంగారెడ్డి జిల్లాకు చెందిన 40 మంది క్రీడాకారులు ఉత్త‌మ ప్ర‌తిభ క‌న‌బ‌రిచి 17 స్వ‌ర్ణ ప‌థ‌కాలు, 11 ర‌జ‌త, 15 కాంస్య పథ‌కాల‌ను సాధించిన‌ట్లు తెలిపారు. విజేత‌ల‌కు కార్మిక శాఖ మంత్రి చామ‌కూర మ‌ల్లారెడ్డి, క‌ళాశాల కార్య‌ద‌ర్శి రాజ‌శేఖ‌ర‌రెడ్డిల చేతుల మీదుగా ప‌త‌కాల‌తో పాటు ప్ర‌శంసా ప‌త్రాల‌ను అంద‌జేశార‌న్నారు. 43 ప‌త‌కాల‌ను సాధించి రంగారెడ్డి జిల్లాను 4వ స్థానంలో నిల‌బెట్టిన క్రీడాకారుల‌కు జిల్లా అసోసిష‌న్ అధ్య‌క్షులు కొండా విజ‌య్‌కుమార్ అభినంద‌న‌లు తెలిపార‌ని, జిల్లా చీఫ్ పాట్ర‌న్ గుడ్ల ధ‌న‌ల‌క్ష్మి క్రీడాకారుల‌కు ట్రాక్‌సూట్లు అంద‌జేసిన‌ట్లు తెలిపారు.

క్రీడాపోటీల్లో విజేత‌లుగా నిలిచిన రంగారెడ్డి జిల్లా క్రీడాకారులు
Advertisement

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here