పార్టీ పెద్ద‌లు నాపై ఉంచిన న‌మ్మ‌కాన్ని నిల‌బెడ‌తా: మ‌క్త‌ల స్వామి గౌడ్‌

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: భార‌తీయ జ‌న‌తా పార్టీ ఓబిసి మోర్చ క‌మిటీలో త‌న‌కు స్థానం క‌ల్పించిన బిజెపి నేత‌ల న‌మ్మ‌కాన్ని నిల‌బెడ‌తాన‌ని రంగారెడ్డి జిల్లా(అర్బ‌న్‌) ఓబిసి మోర్చ నూత‌న ఉపాధ్య‌క్షుడు మ‌క్త‌ల స్వామిగౌడ్ అన్నారు. త‌న‌కు అవ‌కాశం క‌ల్పించిన రంగారెడ్డి అర్బన్ జిల్లా బిజెపి అధ్య‌క్షుడు సామరంగా రెడ్డి, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు నాగేశ్వర్ గౌడ్, నాయ‌కులు మువ్వ సత్యనారాయణ, గ‌జ్జ‌ల యోగనంద్‌, చింత‌కింది గోవర్ధన్ గౌడ్, వై.శ్రీధర్ ల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఓబిసి మోర్చ ప‌ద‌వితో త‌న‌పై బాధ్య‌త మ‌రింత పెరిగింద‌ని, రంగారెడ్డి జిల్లాఓ పార్టీ ప‌టిష్ట‌త‌‌కు కృషి చేయ‌డంతో పాటు ప్ర‌జల‌కు స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలో త‌న‌వంతు బాధ్య‌త‌ను నిర్వ‌ర్తిస్తాన‌ని తెలిపారు.

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here