గచ్చిబౌలి(నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలో నెలకొన్న ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ అధికారులు సహకరించి డివిజన్ అభివృద్దికి తోడ్పాటునందించాలని కార్పొరేటర్ గంగాధరరెడ్డి అన్నారు. సోమవారం శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ రవి కిరణ్ ను మర్యాదపూర్వకంగా కలిసిన గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి పూలమొక్కను ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా స్థానికంగా నెలకొన్న సమస్యలు, చేపట్టవలసిన అభివృద్ధి పనులపై చర్చించారు. అనంతరం గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసినపుడే సమస్యలు త్వరితగతిన పరిష్కారమవుతాయని తెలిపారు. ప్రభుత్వ అధికారులు, స్థానిక ప్రజల సమిష్టి సహకారంతో డివిజన్ అభివృద్దికి కృషి చేస్తానని తెలిపారు.
