గచ్చిబౌలి(నమస్తే శేరిలింగంపల్లి): రామజన్మభూమి అయోధ్యలో నిర్మించ తలపెట్టిన శ్రీరాముని భవ్యమందిరం నిర్మాణానికి సమాజం నుంచి సాత్విక దానాన్ని కోరుతున్నామని గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి అన్నారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపనపల్లి రంగనాథ స్వామి దేవాలయంలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించిన గంగాధర్ రెడ్డి గోపనపల్లి, గౌలిదొడ్డి, నానకరామ్ గూడ, ఖాజాగూడ లో పాదయాత్ర చేస్తూ విరాళాలు సేకరించారు.
నానకరామ్ గూడ లోని హనుమాన్ దేవాలయం కమిటీ తరుపున 5 లక్షల 4 వేల చెక్కును రామమందిర నిర్మాణానికి విరాళం అందించారు. ఈ సందర్భంగా గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ మహసముద్రంపై సేతు నిర్మాణంలో ఉడుత అత్యంత భక్తితో సహకారం అందించినట్లుగా ఈ పవిత్ర యజ్ఞంలో ప్రతి ఒక్కరూ తమ శక్తి మేరకు భాగస్వాములు కావాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కాలనీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.