నమస్తే శేరిలింగంపల్లి: ఇంజనీరింగ్ కళాశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ ఇంజినీరింగ్ కాలేజస్ ఫాకల్టీ అసోసియేషన్ (టెక్ఫా) సభ్యులు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి వినతిపత్రం సమర్పించారు. బుధవారం మంత్రి నివాసంలో టెక్ఫాఅధ్యక్షులు ప్రొ పి వై రమేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ డా.రవీందర్ కొరని ప్రొ.వెంకటేష్ డా.రమేష్ ఆధ్వర్యంలో సబితా ఇంద్రారెడ్డిని కలిసిన అసోసియేషన్ సభ్యులు అధ్యాపకులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. అధ్యాపకులకు కొన్ని కాలేజీలు గత నాలుగైదు నెలల నుండి జీతాలు ఇవ్వక పొగ ఎదురు తిరిగినవారిని ఉద్యోగాల్లో నుండి తీసివేస్తున్నారని తెలిపారు.
కొన్ని కాలేజీలు సగం జీతం తోనే సరిపెడుతున్నాయని వాపోయారు. ఈ విషయమై కళాశాలల వైస్ ఛాన్సిలర్ లతో మాట్లాడి అధ్యాపకులు న్యాయం చేస్తానని త్వరలో అన్ని యూనివర్సిటీ అధికారులతో మాట్లాడతానని సర్కులర్ జారీ చేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.