మియాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ ఆల్విన్ కాలనీకి చెందిన టిఆర్ఎస్ యువ నాయకుడు రామ్ కటకం మొదటిసారి పట్టభద్రుల ఎన్నికల కోసం ఓటరుగా తన పేరును నమోదు చేసుకున్నాడు. రామ్ తన ఫామ్18 పత్రాన్ని సోమవారం చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డికి అందజేశారు. కాగా ఎంపీ రామ్ ను శాలువాతో సత్కరించి అభినందించారు. తోటి పట్టభద్రులందరిచే విధిగా ఓటు హక్కు నమోదు చేయించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మైనారిటీ నాయకులు జహీరుద్దీన్, వహీద్ లు పాల్గొన్నారు.






