గచ్చిబౌలి (నమస్తే శేరిలింగంపల్లి): నిరుపేద మహిళ వైద్య చికిత్స కోసం హోప్ ఫౌండేషన్ చేయూతనందించింది. గచ్చిబౌలి డివిజన్ నల్లగండ్ల ప్రాంతానికి చెందిన సరస్వతి అనే మహిళ అనారోగ్యంతో బాద పడుతుంది. ఆమె వైద్య చికిత్స కోసం ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ చేతులమీదుగా హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండా విజయ్ కుమార్ రూ.10,000 అందజేశారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ నిరుపేదల కోసం ప్రభుత్వం సంక్షేమ పథకాలు తీసుకువచ్చినా స్వచ్ఛంద సంస్థల సహకారం ఎంతో అవసరమని అన్నారు. హోప్ ఫౌండేషన్ లాంటి సేవా సంస్థలు నిరుపేదల విద్య వైద్య ఉపాధి కోసం సహాయ సహకారాలు అందించడం అభినందనీయమని అన్నారు. కొండా విజయ్ కుమార్ లాంటి వారిని ఇతరులు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు రెడ్డి ప్రవీణ్ రెడ్డి, విజయ్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.






