నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ భూములు కబ్జా, చెరువులు అన్యాక్రాంతం విషయంమై సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్. అనంతరం నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని డాక్టర్.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ముఖ్యమంత్రినీ కలిసి విన్నవించారు.
తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటైన ప్రజాపాలన ప్రజల విశ్వసానికి తగ్గట్టు పరిపాలన సాగిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి కాలనీ/బస్తిలో ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యల పరిష్కారానికి నిత్యం ప్రజలలో ఉంటూ వాటి పరిష్కారానికి కృషి చేయాలని ఆయనను కలిసిన శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్ తో అన్నారు.
ప్రజలలో ఉంటూ ప్రజలకు అన్ని పథకాలు అందేలా కార్యకర్తలను ముందుండి నడపాలని జగదీశ్వర్ గౌడ్ కి సూచించారు.