అభివృద్ధి పనులపై కమీషనర్ సమీక్షా

  • అవసరమున్న చోట డస్ట్ బిన్లు ఏర్పాటు చేయాలని, వినియోగంలో లేని టాయిలెట్స్ తొలగించాలని అధికారులకు రోనాల్డ్ రాస్ ఆదేశం

నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి మండలంలోని యూసఫ్ గూడ, శేరిలింగంపల్లి, చందనగర్, రామచంద్రపురం, పఠాన్ చెరు అభివృద్ధి పనులపై జీహెచ్ ఎంసీ కమీషనర్ రోనాల్డ్ రాస్ సమీక్షా సమావేశం నిర్వహించారు.

శేరిలింగంపల్లి మండలంలోని అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశంలో జీహెచ్ ఎంసీ కమీషనర్ రోనాల్డ్ రాస్

ఆయా సర్కిల్లలోని పారిశుధ్య పనులపై అధికారులతో చర్చించారు. అనంతరం మాట్లాడుతూ… గేటేడ్ కమ్యూనిటీస్ లో డస్ట్ బిన్లు ఏర్పాటు చేయాలని, వినియోగంలో లేని టాయిలెట్స్ తొలగించాలని అధికారులకు తెలిపారు. అంతేకాక చెత్తను ఎస్ టీపీలకు ఎత్తడం, చెత్త సేకరణ వాహనాల సంఖ్య పెంచడం, కాలనీ లలో రిసోర్స్ పర్సన్స్ మెప్మా సహాయంతో ఐ ఈ సి కార్యకలాపాలు చేపట్టాలని సూచించారు. అంతకుముందు శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ స్నేహ శబరిష్ ఐఏఎస్, పారిశుధ్య, ఇంజినీరింగ్ కమీషనర్, యుబిడి, టౌన్ ప్లానింగ్ వింగ్ తో పాటు ఉపేందర్ రెడ్డి, దుర్గం చెరువు, సరిహద్దు ప్రాంతాల్లో గోడ నడక మార్గం ప్రాంతాలను పరిశీలించారు.

పాల్గొన్న ఆయా శాఖల అధికారులు

దుర్గం చెరువు ప్రవేశ ప్రాంతాల్లో కియోస్కొలు ఉండకూడదని వాటికి అనుమతి ఇవ్వద్దని తెలిపారు. ఫుట్ పాత్ ఆక్రమణల జరగకుండా ఉండేందుకు ఉక్కు కడ్డిలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్లు, జాయింట్ కమిషనర్ శానిటేషన్, ఇంజినీరింగ్ యుబి డి వింగ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here