నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ డివిజన్ పరిధిలోని అన్ని ప్రాంతాల ప్రజలకు మెరుగైన మౌళిక వసతులు కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం తలపెట్టిన పట్టణ ప్రగతి 3వ విడతలో భాగంగా గురువారం డివిజన్ పరిధిలోని హరిజన బస్తీలో, కార్పొరేటర్ పూజిత జగదీశ్వర్‌గౌడ్, ప్రభుత్వ అధికారులతో కలిసి పర్యటించిన జగదీశ్వర్‌గౌడ్ పలు సమస్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా బస్తీలో పేరుకుపోయిన చెత్త, భవన నిర్మాణ వ్యర్ధాలను తొలగించి పరిశుభ్రంగా ఉంచాలని జగదీశ్వర్‌గౌడ్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అధికారులు డి.ఈ రూప దేవి, హెచ్. ఎం.డబ్లు.ఎస్.ఎస్.బి మేనేజర్ ఇల్వర్తి, ఇంజినీరింగ్ ఏ.ఈ ప్రశాంత్, శానిటరీ ఎస్.అర్.పి శ్రీనివాస్ రెడ్డి బస్తి నాయకులు సహదేవ్, ప్రభు, రాజు, శ్రీకాంత్, ఈ.రాజు, సుధాకర్, శ్రీనివాస్, వర్క్ ఇన్స్పెక్టర్ చారి, ఎస్.ఎఫ్. ఏ ప్రసాద్, బలరాజు, సంతోష్, అంకైయ, సురేష్ తదితరులు పాల్గొన్నారు.