ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మంతో ప్ర‌తీ బ‌స్తీ ప‌రిశుభ్రంగా మారాలి: ప్ర‌భుత్వ విప్ గాంధీ

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ప‌ది రోజుల పాటు జ‌రుప‌న‌న్న ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మంతో శేరిలింగంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని ప్ర‌తీ బ‌స్తీ, కాల‌నీ ప‌రిశుభ్రంగా మారాల‌ని ప్ర‌భుత్వ విప్ గాంధీ అన్నారు. ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మ ప్రారంభోత్స‌వాన్ని చందాన‌గ‌ర్ స‌ర్కిల్ కార్యాల‌యం వ‌ద్ద గురువారం నిర్వ‌హించారు. ఈసంద‌ర్భంగా స‌ర్కిల్ ప‌రిధిలోని కార్పొరేట‌ర్లు జ‌గ‌దీశ్వ‌ర్‌గౌడ్‌, ఉప్ప‌ల‌పాటి శ్రీ‌కాంత్‌, మంజుల ర‌ఘునాథ్‌రెడ్డి, పూజిత జ‌గ‌దీశ్వ‌ర్‌గౌడ్, ఉప కమిషనర్ సుధాంష్ ల‌తో క‌లిసి ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి వాహ‌నాల‌ను ఆరికెపూడి గాంధీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా గాంధీ మాట్లాడుతూ ముఖ్య‌మంత్రి కెసిఆర్‌, మంత్రి కెటిఆర్ ల ఆదేశాల మేర‌కు ప‌ల్లెలు, ప‌ట్ట‌ణాల స‌మ‌గ్ర‌, స‌మ్మిళిత అభివృద్దే ధ్యేయంగా ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించుకుంటున్నామ‌ని, అన్ని విభాగాల అధికారులు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేసి నియోజ‌క‌వ‌ర్గాన్ని సుందరంగా తీర్చిదిద్దాల‌న్నారు.

ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి వాహ‌నాల‌ను జెండా ఊపి ప్రారంభిస్తున్న ప్ర‌భుత్వ విప్ అరికెపుడి గాంధీ

ప్ర‌జ‌లు ఎల్ల‌ప్పుడూ త‌మ ప‌రిస‌రాల‌ను ప‌రిశుభ్రంగా ఉంచుకోవాల‌ని, నీటి నిల్వ డ్రమ్ములు, కూలర్ ల‌లో వారానికి ఒకసారి పూర్తిగా తొల‌గించ‌డం ద్వారా దోమ‌ల‌ను నివారించ‌వ‌చ్చ‌ని తెలిపారు. మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా , ఫైలేరియా, మెదడువాపు తదితర సీజనల్ వ్యాధుల నివారణ కోసం ఇప్పటి నుంచే ప్రజలు అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని, వర్షా కాలంలో ఎలాంటి రోగాలు రాకూండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్య‌క్ర‌మంలో భాగంగా పారిశుద్ద్య కార్మికుల‌కు సేఫ్టీ కిట్ల‌ను అంద‌జేశారు.

పారిశుద్ధ్య కార్మికుల‌కు సేఫ్టీ కిట్ల‌ను అంద‌జేస్తున్న దృశ్యం

ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి అధికారులు ఈఈ శ్రీకాంతి , డీఈ రూపదేవి, డీఈ సురేష్ , ఏఈలు అనురాగ్ , రమేష్, ప్రశాంత్ ఇన్స్పెక్టర్లు శ్రీధర్ , జగదీష్, శానిటేషన్ సూపర్ వైజర్ శ్రీనివాస్, చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, హఫీజ్పెట్ డివిజన్ అధ్యక్షులు గౌతమ్ గౌడ్, తెరాస నాయకులు పురుషోత్తం యాదవ్, వాలా హరీష్ , దాసరి గోపి, వెంకటేష్ , గుమ్మడి శ్రీను, రాంచందర్, జ‌నార్దన్ రెడ్డి, రవీందర్ రెడ్డి, అక్బర్ ఖాన్, గురుచరన్ దుబే, వెంకటేష్ గౌడ్, పారునంది శ్రీకాంత్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here