మొబైల్ వాక్సినేషన్ సెంటర్ ను సంద‌ర్శించిన‌ రాగం

న‌మస్తే శేరిలింగంప‌ల్లి: శేరిలింగంప‌ల్లి డివిజ‌న్ ప్ర‌జ‌ల కోసం గ‌చ్చిబౌలి సంధ్య క‌న్వెన్ష‌న్ హాలులో ఏర్పాటు చేసిన మొబైల్ వ్యాక్సినేష‌న్ సెంట‌ర్ ను స్థానిక కార్పొరేట‌ర్ రాగం నాగేంద‌ర్‌యాద‌వ్ బుధ‌వారం సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా వ్యాక్సినేష‌న్ ప్రక్రియ‌ను ప‌రిశీలించి ఇత‌ర వివ‌రాల‌ను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ వ్యాక్సిన్ వేయించుకోని వారు వెంట‌నే వ్యాక్సినేష‌న్ చేయించుకోవాల‌ని ఆయ‌న సూచించారు. మొబైల్ వ్యాక్సినేష‌న్ సెంట‌ర్ల ద్వారా ప్ర‌జ‌ల‌కు టీకా సుల‌భంగా అందుతుంద‌ని ఆయ‌న అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో మునిసిపల్ అధికారులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

మొబైల్ వ్యాక్సినేష‌న్ సెంట‌ర్‌ను ప‌రిశీలిస్తున్న రాగం నాగేంద‌ర్‌యాద‌వ్‌
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here