నమస్తే శేరిలింగంపల్లి: దేశ ప్రజలకు కరోనా కష్టకాలంలో అండగా నిలిచేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ యోజన పేద ప్రజలకు వరంగా మారిందని శేరిలింగంపల్లి బిజెపి అధ్యక్షులు రాజుశెట్టి కురుమ అన్నారు. సోమవారం డివిజన్ పరిధిలోని రాజీవ్‌గృహకల్ప లోని రేషన్ షాపులో నిత్యవసరాల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వినియోగదారులకు గరీబ్ కళ్యాణ యోజక పథకాన్ని వివరించారు. అనంతరం రాజు శెట్టి మాట్లాడుతూ లాక్‌డౌన్ కారణంగా ఉపాది లేక నిరుపేద ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, ఈ నేపథ్యంలోనే నిరుపేద ప్రజలకు ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున బియ్యం మూడు నెలల పాటు ఉచితంగా అందించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పథకాలను పేదలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ దళిత మొర్చా అధికార ప్రతినిధి శ్రీమతి కాంచన కృష్ణ గారు, డివిజన్ ప్రధాన కార్యదర్శి సత్య కురుమ, కోశాధికారి పి.కౌసల్య, బాలు, స్వాతి తదితరులు పాల్గొన్నారు.
