అభివృద్ది ప‌నుల‌ను త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేయాలి: కార్పొరేట‌ర్ ఉప్ప‌ల‌పాటి శ్రీ‌కాంత్‌

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: మియాపూర్ డివిజ‌న్‌లో అభివృద్ది ప‌నుల‌ను త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేసి ప్ర‌జ‌లకు అందుబాటులోకి తీసుకురావాల‌ని కార్పొరేట‌ర్ ఉప్ప‌ల‌పాటి శ్రీ‌కాంత్ అన్నారు. సోమ‌వారం డివిజ‌న్ ప‌రిధిలోని మ‌క్త మ‌హ‌బూబ్‌పేట్ గ్రామంలో జరుగుతున్న సిసిరోడ్డు ప‌నుల‌ను ఆయ‌న జిహెచ్ఎంసి అధికారుల‌తో క‌లిసి ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా ఉప్ప‌ల‌పాటి శ్రీ‌కాంత్ మాట్లాడుతూ అభివృద్ది ప‌నుల్లో నాణ్య‌త విష‌యంలో రాజీ ప‌డ‌వ‌ద్ద‌ని అన్నారు. ప్ర‌జ‌ల‌కు ఎలాంటి ఇబ్బందులు క‌లుగ‌కుండా ప‌నుల‌ను పూర్తి చేయాల‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో టిఆర్ఎస్ నాయ‌కులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

సిసిరోడ్డు ప‌నుల‌ను పరిశీలిస్తున్న కార్పొరేట‌ర్ ఉప్ప‌లపాటి శ్రీ‌కాంత్‌
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here