నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందేలా చూస్తామని మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్‌గౌడ్ అన్నారు. మంగళవారం జరిగిన జిహెచ్ఎంసి పాలకమండలి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన మొదటి సర్వసభ్య సమావేశంలో జగదీశ్వర్‌గౌడ్ హఫీజ్‌పేట్ డివిజన్ కార్పొరేటర్ పూజిత జగదీశ్వర్‌గౌడ్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగదీశ్వర్‌గౌడ్ మాట్లాడుతూ 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను 5600 కోట్ల రూపాయల బడ్జెట్‌ను బల్దియా ఆమోదించిందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో, మున్సిపల్ శాఖామంత్రి కేటీఆర్ దిశానిర్దేశంలో గ్రేటర్ హైదరాబాద్ నగర అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో మౌలికవసతుల అభివృద్ధికి కృషి చేస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరే విధంగా తాము కృషి చేస్తానని, ప్రజలతరపున ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. మాదాపూర్, హఫీజ్‌పేట్ డివిజన్లలో అభివృద్ధి పనులు త్వరగా పూర్తయ్యేలా చూస్తామని, మిలిగి ఉన్న సీసి రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, స్మశానవాటికలో అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. బడ్జెట్ పై తమ అభిప్రాయాన్ని తెలిపే అవకాశం కల్పించిన నగర మేయర్ కు కృతజ్ఞతలు తెలిపారు.
