నమస్తే శేరిలింగంపల్లి: పలు సాంకేతిక కారణాలు, మరమ్మత్తుల కారణంగా జూన్ 29వ తేదీ బుధవారం నల్లగండ్ల, తెల్లాపూర్ పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఉయం 10గం.ల నుండి 11 గం.ల వరకు ఎపిస్టోమ్ గ్లోబల్ ఫీడర్ పరిధిలోని తెల్లపూర్ రోడ్, సాధన స్కూల్ వెనక ప్రాంతం, ఎపిస్టోమ్ స్కూల్, రాక్ పార్క్, మధ్యాహ్నం 12 గం.ల నుండి 1 గం.ల వరకు నల్లగండ్ల హుడా ఫీడర్ పరిధిలోని నల్లగండ్ల హుడా వాటర్ ట్యాంక్ ప్రాంతం, రత్నదీప్ వెనుక ప్రాంతం, తెల్లాపూర్ చౌరస్తా, యాక్సిస్ బ్యాంకు వెనక ప్రాంతం, మధ్యాహ్నం 3గం.ల నుండి 4గం.ల వరకు జవహార్ నవోదయ ఫీడర్ పరిధిలోని సాయిరామ్ నగర్ కాలనీ, కాంచ గచ్చిబౌలి, జవహార్ నవోదయ స్కూల్, రాంకీ టవర్స్, సాయంత్రం 4:30 గం.ల నుండి 5:30 గం.ల వరకు లక్ష్మీ విహార్ ఫీడర్ పరిధిలోని లక్ష్మీ విహార్ ఫేజ్ 1, 2, డిఫెన్స్ కాలనీ, నల్లగండ్ల ప్రభుత్వ పాఠశాల, రెడ్డి బస్తీ తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు.