స్మ‌శాన‌వాటిక‌ల‌ను అమ్ముకోవ‌డం టిఆర్ఎస్ పార్టీ దిగజారుడుత‌నానికి నిద‌ర్శనం: సామ రంగారెడ్డి

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: ప్ర‌భుత్వ భూముల‌ను తాక‌బోమ‌ని చెప్పిన కెసిఆర్ ప్ర‌భుత్వం నేడు స్మ‌శాన‌వాటిక‌ల‌ను సైతం వ‌ద‌ల‌కుండా అమ్ముకుంటోంద‌ని బిజెపి రంగారెడ్డి జిల్లా అర్భ‌న్ అధ్య‌క్షులు సామ రంగారెడ్డి అన్నారు. మంగ‌ళ‌వారం ఆయ‌న బిజెపి రాష్ట్ర నాయ‌కులు ర‌వికుమార్‌యాద‌వ్‌, గ‌జ్జ‌ల యోగానంద్‌, జ్ఞానేంద్ర‌ప్ర‌సాద్‌ల‌తో క‌లిసి శేరిలింగంప‌ల్లి ఖానామెట్ స్మ‌శాన‌వాటిక‌ను సంద‌ర్శించి స్థానికుల‌తో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా రంగారెడ్డి మాట్లాడుతూ 50 సం రాలుగా స్థానికులు ఉప‌యోగించుకుంటున్ స్మశానవాటికను డబ్బుల కోసం అమ్మడం తెరాస దిగజారుడు తనానికి నిదర్శనమని తెలిపారు. స్మ‌శానవాటిక స్థలాన్ని వేలం ఆపకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని తెలిపారు. వేలాన్ని వెంట‌నే ఆపి బ‌స్తీ వాసులకు క్ష‌మాపణలు చెప్పాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ కాంటెస్టెడ్ కార్పొరేటర్ రాధాకృష్ణ యాదవ్, గంగుల నరసింహ యాదవ్, యోగానంద్ , బుచ్చిరెడ్డి, జ్ఞ్యానేంద్ర ప్రసాద్, ప్రభాకర్ యాదవ్, శ్రీనివాస్ రెడ్డి, మధన చారీ, బాల కుమార్, పద్మ త‌దిత‌రులు పాల్గొన్నారు.

ఖానామెట్ స్మ‌శాన‌వాటిక స్థ‌లాన్ని ప‌రిశీలిస్తున్న సామ‌రంగారెడ్డి, బిజెపి నాయ‌కులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here