శేరిలింగంప‌ల్లి, మియాపూర్‌ల‌లో మంగ‌ళ‌వారం విద్యుత్ ఉండ‌ని ప్రాంతాలు

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: విద్యుత్ తీగ‌ల‌కు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మ‌ల తొల‌గింపు, ఇత‌ర మర‌మ్మ‌త్తుల కార‌ణంగా శేరిలింగంప‌ల్లి ప‌రిధిలోని ప‌లు ప్రాంతాల్లో సోమ‌వారం విద్యుత్ స‌ర‌ఫ‌రాలో అంత‌రాయం ఏర్ప‌డ‌నుంది. కొండాపూర్ సుద‌ర్శ‌న్‌న‌గ‌ర్ 11 కెవి ఫీడ‌ర్ ప‌రిధిలో ఉద‌యం 10గం.ల నుండి మ‌ధ్యాహ్నం 12గం.ల వ‌ర‌కు సుద‌ర్శ‌న్ న‌గ‌ర్ రోడ్ నెం.2, 3, 4, 5, చిరాక్ ప‌బ్లిక్ స్కూల్‌, పాపిరెడ్డి కాల‌నీ ఫీడ‌ర్ ప‌రిధిలోని పాపిరెడ్డి కాల‌నీలో మ‌ధ్యాహ్నం 3 గం.ల నుండి సా.5గం.ల వ‌ర‌కు విద్యుత్ స‌ర‌ఫ‌రాను అధికారులు నిలిపివేయ‌నున్నారు.


అదేవిధంగా మియాపూర్ 11 కెవి. ఫీడ‌ర్ ప‌రిధిలోని కృషిన‌గ‌ర్‌, ఎమ్ఎన‌గ‌ర్‌, స్టాలిన్‌న‌గ‌ర్‌, రాఘ‌వేంద్ర పాంచ‌జ‌న్య అపార్ట్‌మెంట్‌, ఏలియ‌న్ అపార్ట్‌మెంట్‌, ప్ర‌శాంత్‌న‌గ‌ర్‌, హనుమాన్ దేవాల‌య ప్రాంతం, వాట‌ర్ ట్యాంక్ ఏరియా, మ‌ణిసాయి అపార్ట్ మెంట్‌, మిర్రా హాస్పిట‌ల్‌, సాయిరామ్ న‌గ‌ర్‌, అల్లూరి సీతారామ‌రాజున‌గ‌ర్‌, డి.కె.న‌గ‌ర్‌, స్వ‌ర్ణ‌పురి కాల‌నీ, రెడ్డి ల్యాబ్‌, జెపి న‌గ‌ర్‌, మ‌క్తా విలేజ్‌, క్రిష్ణ‌సాయి ఎన్‌క్లేవ్‌, బికే ఎన్‌క్లేవ్ త‌దిత‌ర ప్రాంతాల్లో ఉద‌యం 8గం.ల నుండి 11గం.ల వ‌ర‌కు విద్యుత్ స‌ర‌ఫ‌రాలో అంత‌రాయం ఏర్ప‌డుతుంద‌ని అధికారులు పేర్కొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here