- పీజేఆర్ స్టేడియంలో వ్యాక్సినేషన్‌ను పరిశీలించిన కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి
నమస్తే శేరిలింగంపల్లి: సూర్‌స్ప్రెడర్స్ వ్యాక్సినేషన్ డ్రైవ్ మరింత జోరందుకుంది. స్పెషల్ డ్రైవ్‌ను ఐదురోజుల పాటు పొడగిస్తూ నుంచి ప్రతి సర్కిల్‌లో డోసుల సంఖ్య వెయ్యి నుంచి పదిహేను వందలకు పెంచిన విషయం విదితమే. ఈ క్రమంలోనే సోమవారం శేరిలింగంపల్లి సర్కిల్‌లోని గచ్చిబౌలి సంధ్య కన్వెన్షన్ హాల్‌లో 18 ఏళ్లు పైబడిన వారికి 1012 మంది, 45 ఏళ్లు పైబడిన వారు 176 కలిపి మొత్తం 1188 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. చందానగర్ సర్కిల్ పరిధిలోని పీజేఆర్ స్టేడియంలో 18 ఏళ్లు పైబడిన వారికి 944 మంది, 45 ఏళ్లు పైబడిన వారు 332 కలిపి మొత్తం 1276 మంది కోవీషీల్డ్ టీకా తీసుకున్నారు. కాగా పీజేఆర్ స్టేడియంలో సూపర్ స్ప్రెడర్స్ వ్యాక్సినేషన్ ప్రక్రియను స్థానిక కార్పొరేటర్ మంజుల రఘునాథ్‌రెడ్డి సోమవారం పరిశీలించారు. వ్యాక్సిన్ కోసం వచ్చిన వారితో అదేవిధంగా సర్కిల్ ఉపవైద్యాధికారి డాక్టర్ కార్తిక్‌తో మాట్లాడి అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు. ఆమెతో పాటు టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్‌రెడ్డి, నాయకులు ధనలక్ష్మి, ఓర్సు వెంకటేశ్వర్లు, రవిందర్ రెడ్డి, నరేందర్ భల్లా, భవాని తదితరులు పాల్గొన్నారు.
కొండాపూర్ ఏరియా హాస్పిటల్‌లో 132 మందిలో నలుగురికి పాజిటీవ్…
కొండాపూర్ ఏరియా హాస్పిటల్‌లో కోవీషీల్డ్ సెకండ్ డోస్ 17 మంది తీసుకున్నారు. కాగా 49 మందికి ఆర్టీపీసీఆర్, 132 మందికి ర్యాపిడ్ యాంటీజెన్ కలిపి మొత్తం 181 టెస్టులు చేసినట్టు సూపరింటెండెంట్ వరదాచారి ఒక పేర్కొన్నారు. ఐతే 132 మందిలో నలుగురికి మాత్రమే కరోనా పాజిటీవ్ వచ్చినట్టు ఆయన తెలిపారు. కోవాక్జీన్, కోవీషీల్డ్ రెండవ డోసు పంపిణీ కొనసాగుతుందని అర్హులైన వారుఈ అవకాశాన్నిసద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.