త‌ల‌సేమియా బాధితుల‌కు సైబ‌రాబాద్ పోలీసుల అండ‌… మాదాపూర్, రాయ‌దుర్గం పోలీసు స్టేష‌న్‌ల‌లో ర‌క్త‌దానం…

  • మాదాపూర్‌లో 62 యూనిట్ల ర‌క్తం సేక‌ర‌ణ‌…

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి:మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బుట్ట కన్వెన్షన్ లో సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ ఆదేశాల మేరకు ఇన్‌స్పెక్ట‌ర్‌ రవీంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో తలసేమియా బాధితుల సహాయార్థం సోమ‌వారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ రక్తదాన శిబిరాన్ని మాదాపూర్ జోన్ డిసిపి వెంకటేశ్వర్లు పర్యవేక్షించి రక్తదానం చేసిన దాతలకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా డిసిపి మాట్లాడుతూ సైబరాబాద్ సీపీ సజ్జనార్ ఆదేశాల ప్రకారం ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. రక్తం కోసం తలసేమియా బాధితులు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న పలువురు ఎస్సైలు, పోలీస్ సిబ్బంది మరియు స్వచ్ఛందంగా రక్తదానం చేయడానికి వచ్చిన దాతలు అందరికీ ఆయ‌న ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. మధ్యాహ్నం మూడు గంటల వరకు కొన‌సాగిన ఈ రక్త శిబిరంలో 62 యూనిట్ల రక్తాన్ని సేకరించినట్లు ఇన్‌స్పెక్ట‌ర్ ర‌వీంద్ర‌ప్ర‌సాద్ తెలిపారు. ఈ రక్తదాన శిబిరంలో డిసిపి తోపాటు మాదాపూర్ ఏసీపీ ర‌ఘునంద‌న్‌రావు, ఇన్‌స్పెక్ట‌ర్‌ రవీంద్ర ప్రసాద్, ఎస్సైలు వీరప్రసాద్ ,భాస్కర్, సుఖేందర్రెడ్డి, హారిక పోలీసు సిబ్బంది ఉన్నారు.

శిబిరాన్ని ప్రారంభించి ర‌క్త‌దానం చేస్తున్న మాదాపూర్‌ పోలీసుల‌ను అభినందిస్తున్న మాదాపూర్ డీసీపీ వెంక‌టేశ్వ‌ర్లు, ఇన్‌స్పక్ట‌ర్ ర‌వీంద్రప్ర‌సాద్ త‌దిత‌రులు

రాయ‌దుర్గం పొలీస్‌స్టేష‌న్‌లో…
సైబ‌రాబాద్ సీపీ వీసీ స‌జ్జ‌నార్ ఆదేశాల మేర‌కు రాయ‌దుర్గం పోలీస్‌స్టేష‌న్‌లోను సోమ‌వారం ర‌క్త‌దాన శిబిరం ఏర్పాటు చేశారు. డీసీపీ వెంక‌టేశ్వ‌ర్లు, ఏసీపీ ర‌ఘునంద‌న్‌రావులు శిబిరాన్ని ప్రారంభించి, దాత‌ల‌కు ప్ర‌శంసా ప‌త్రాలు అంద‌జేశారు. కాగా ఈ శిబిరంలో 53 యూనిట్ల ర‌క్తాన్నిసేక‌రించిన‌ట్టు ఇన్‌స్పెక్ట‌ర్ రాజ‌గోపాల్‌రెడ్డి తెలిపారు. ఈ రక్తదాన శిబిరంలో మాదాపూర్ డిసిపి వేంకటేశ్వర్లు, మాదాపూర్ ఏసీపీ రఘునందన్ రావు తోపాటు మాదాపూర్ ఇన్స్పెక్టర్ రాజగోపాల్ రెడ్డి, ఎస్సైలు సైదులు, వెంకటేష్, సందీప్ రాజ్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

రాయ‌దుర్గం పీఎస్‌లో ర‌క్త‌దానం చేసిన దాత‌ల‌కు ప్ర‌శంసా ప‌త్రాలు అందేజేస్తున్న డీసీపీ వెంక‌టేశ్వ‌ర్లు, ఏసీపీ ర‌ఘునంద‌న్‌రావు, ఇన్‌స్పెక్ట‌ర్ రాజ‌గోపాల్‌రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here