నమస్తే శేరిలింగంపల్లి: తారానగర్ సబ్ స్టేషన్ పరిధిలోని ఎపిస్టోమ్ గ్లోబల్ ఫీడర్, జవహార్ నవోదయ ఫీడర్‌ల పరిధిలోని ప్రాంతాల్లో గురువారం సాంకేతిక కారణాల వల్ల విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఎపిస్టోమ్ ఫీడర్ పరిధిలోని నల్లగండ్ల క్రాస్‌రోడ్, తెల్లాపూర్ కమాన్, సంధ్య స్కూల్, ఎపీస్టోమ్ స్కూల్ ఏరియా, సంధ్య స్కూల్ వెనుక వైపు ఉదయం 10గం.ల నుండి మధ్యాహ్నం 12 గం.ల వరకు, నవోదయ ఫీడర్ పరిధిలోని సాయిరామ్‌నగర్ కాలనీ, కంచ గచ్చిబౌలి, యుసిఒ బ్యాంక్, జవహార్ నవోదయ స్కూల్, యుసిఒ బ్యాంకు వెనుక ప్రాంతాల్లో మధ్యాహ్నం 3గం.ల నుండి సాయంత్రం 5గం.ల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు తెలిపారు.