నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని మక్తా మహబూబ్‌పేట్, బొల్లారం రహదారి మధ్య 100 ఫీట్ల రహదారి నిర్మాణంతో ట్రాఫిక్ సమస్యలు సమసిపోతాయని స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ అన్నారు. బుధవారం జిహెచ్ఎంసి ఈఈ శ్రీకాంతి, డిఇ రమాదేవి లతో కలిసి ఆయన రహదారి నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఉప్పలపాటి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో జనసామర్ధ్యం పెరిగి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయని, ఈ నేపథ్యంలో రహదారి విస్తరణతో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పడనుందన్నారు. ఈ కార్యక్రమంలో వర్క్ ఇన్‌స్పెక్టర్‌లు విశ్వనాథరెడ్డి, జగన్ తదితరులు పాల్గొన్నారు.
