గచ్చిబౌలి పోలీస్, ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో బుధవారం మెగా రక్తదాన శిభిరాన్ని నిర్వహించారు. పోలీస్‌స్టేషన్ ఆవరణలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాదాపూర్ డిసిపి వేంకటేశ్వర్లు, ఎసిపి రఘునందన్ రావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వేంకటేశ్వర్లు మాట్లాడుతూ తలసేమియా బాధితుల కోసం గచ్చిబౌలి పోలీసులు రక్తదాన శిభిరాన్ని నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. ఆపదలో ఉన్న వారి ప్రాణాలను రక్షించేందుకు రక్తదానం ఎంతగానో ఉపకరిస్తుందని తెలిపారు. ఈ శిభిరంలో 102 యూనిట్ల రక్తాన్ని సేకరించి ఉస్మానియా బ్లడ్‌బ్యాంకుకు అందజేసినట్లు నిర్వాహకులు తెలిపారు. శిభిరాన్ని విజయవంతం చేసిన ప్రతీఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి ఇన్‌స్పెక్టర్ సురేష్, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ నర్సింహరావులతో పాటు పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.